| Singer | Hosanna ministers |
| Composer | |
| Music | |
| Song Writer |
Lyrics
రాజ జగమెరిగిన నా యేసు రాజా
రాగాలలో అనురాగాలు కురిపించిన
మనబంధము అనుబంధము } 2
విడదీయగలరా ఎవరైనను మరి ఏదైనను? || రాజ ||} 2
దీన స్థితియందున సంపన్న స్థితియందున
నడచినను ఎగిరినను సంతృప్తి కలిగి యుందునే } 2
నిత్యము ఆరాధనకు నా ఆధారమా
స్తోత్రబలులు నీకే అర్పించెద యేసయ్యా } 2|| రాజ ||
బలహీనతలయందున అవమానములయందున
పడినను కృంగినను నీకృప కలిగియుందునే } 2
నిత్యము ఆరాధనకు నా ఆధారమా
స్తోత్రబలులు నీకే అర్పించెద యేసయ్యా } 2|| రాజ ||
సీయోను షాలేము మన నిత్య నివాసము
చేరుటయే నా ధ్యానము ఈ ఆశ కలిగి యుందునే } 2
నిత్యము ఆరాధనకు నా ఆధారమా
స్తోత్రబలులు నీకే అర్పించెద యేసయ్యా } 2
0 Comments