Ticker

6/recent/ticker-posts

అందాలతార అరుదెంచె నాకై

Lyrics

అందాలతార అరుదెంచె నాకై అంబర వీధిలో

అవతారమూర్తి యేసయ్య కీర్తి అవని చాటుచున్

ఆనందసంద్ర ముప్పొంగె నాలో అమరకాంతిలో

ఆది దేవుని జూడ ఆశింప మనసు పయనమైతిని               ||అందాల తార||


విశ్వాసయాత్ర దూరమెంతైన విందుగా దోచెను

వింతైన శాంతి వర్షించె నాలో విజయపథమున

విశ్వాలనేలెడి దేవకుమారుని వీక్షించు దీక్షలో

విరజిమ్మె బలము ప్రవహించె ప్రేమ విశ్రాంతి నొసగుచున్         ||అందాల తార||


యెరూషలేము రాజనగరిలో యేసును వెదకుచు

ఎరిగిన దారి తొలగిన వేళ ఎదలో కృంగితి                        

యేసయ్యతార ఎప్పటివోలె ఎదురాయె త్రోవలో

ఎంతో యబ్బురపడుచు విస్మయ మొందుచు ఏగితి స్వామి కడకు||అందాల తార||


ప్రభుజన్మస్ధలము పాకయేగాని పరలోక సౌధమే

బాలునిజూడ జీవితమెంత పావనమాయెను

ప్రభుపాదపూజ దీవెనకాగా ప్రసరించె పుణ్యము

బ్రతుకే మందిరమాయె అర్పణలే సిరులాయె ఫలియించె ప్రార్ధన.     ||అందాల తార||


అందాల తార Watch Video

Post a Comment

0 Comments