ఆరాధన స్తుతి ఆరాధన Lyrics - Pastor Ravindra vottepu
ఆరాధన స్తుతి ఆరాధన (3)నీవంటి వారు ఒక్కరును లేరు – నీవే అతి శ్రేష్టుడా
దూత గణములు నిత్యము కొలిచే – నీవే పరిశుద్దుడా
నిన్నా నేడు మారని || ఆరాధన ||
1. అబ్రహాము ఇస్సాకును – బలి ఇచ్చినారాధన
రాళ్ళతో చంపబడిన – స్తెఫను వలె ఆరాధన (2)
ఆరాధన స్తుతి ఆరాధన (2)
పదివేలలోన అతి సుందరుడా – నీకే ఆరాధన
ఇహ పరములోన ఆకాంక్షనీయుడా – నీకు సాటెవ్వరు
నిన్నా నేడు మారని || ఆరాధన ||
2. దానియేలు సింహపు బోనులో – చేసిన ఆరాధన
వీధులలో నాట్యమాడిన – దావీదు ఆరాధన (2)
ఆరాధన స్తుతి ఆరాధన (2)
నీవంటి వారు ఒక్కరును లేరు – నీవే అతి శ్రేష్టుడా
దూత గణములు నిత్యము కొలిచే – నీవే పరిశుద్దుడా
నిన్నా నేడు మారని || ఆరాధన ||
0 Comments