Ticker

6/recent/ticker-posts

అంతా నా మేలుకే - ఆరాధనా యేసుకే

అంతా నా మేలుకే - ఆరాధనా యేసుకే Lyrics - Dr. Asher Andrew


అంతా నా మేలుకే - ఆరాధనా యేసుకే
Singer Dr. Asher Andrew
Composer Dr. Asher Andrew
Music Pranam Kamlakhar
Song WriterDr. Asher Andrew

Lyrics

పల్లవి : నేనెల్లప్పుడు యెహోవాను సన్నుతించెదన్‌ 

             నిత్యము ఆయన కీర్తి నా నోట నుండున్‌ - (2) 


అ.ప. : అంతా నా మేలుకే - ఆరాధనా యేసుకే 

అంతా నా మంచికే - (తన చిత్తమునకు తల వంచితే)- (2) 

అరాధన ఆపను - స్తుతియించుట మానను - (2) 

స్తుతియించుట మానను


1. కన్నీల్లే పానములైన - కఠిన దుఃఖ బాధలైన 

స్థితిగతులే మారిన - అవకాశం చేజారిన 

మారదు యేసు ప్రేమ - నిత్యుడైన తండ్రి ప్రేమ - (2) 

మారదు యేసు ప్రేమ - నిత్యుడైన తండ్రి ప్రేమ - (2)
 

2. ఆస్తులన్ని కోల్పొయిన - కన్నవారే కునుమరుగైన 

ఊపిరి బరువైన - గుండెలే పగిలినా 

యెహోవా యిచ్చెను - యెహోవా తీసికొనెను - (2) 

ఆయన నామమునకే - స్తుతి కలుగు గాక - (2)
 

3. అవమానం ఎంతైన - నా వారే కాదన్న 

నీవు తప్ప ఎవరున్నారు ఆకాశమందునా ? 

నీవు నా కుండగా - ఏది నాకక్కర లేదు - (2) 

నీవు నా కుండగా - ఏది నాకక్కర లేదు - (2) 


 4. ఆశలే సమాధియైన - వ్యాధి బాధ వెల్లువైన 

అధికారము కొప్పుకొని - రక్షణకై ఆనందింతున్‌ 

నాదు మనస్సు నీ మీద - ఆనుకొనగ ఓ నాధా (2) 

పూర్ణశాంతి నే పొంది నిన్నే నే కీర్తింతున్‌ (2)

 
5. చదువులే రాకున్న - ఓటమి పాలైన 

ఉద్యోగం లేకున్న - భూమికే బరువైన 

నా యెడల నీ తలంపులు - ఎంతో ప్రియములు - (2) 

నీవుద్దేశించినది నిష్ఫ్టలము కానేరదు - (2) 

 
6. సంకల్పాన పిలుపొంది - నిన్నే ప్రేమించు నాకు 

సమస్తము సమకూడి - మేలుకై జరుగును 

యేసుని సారూప్యము నేను పొందాలని - (2) 

అనుమతించిన ఈ - విలువైన సిలువకై - (2) 

 
7. నీవు చేయునది - నాకిప్పుడు తెలియదు 

ఇక మీదట నేను - తెలిసికొందును 

ప్రస్తుతము సమస్తము - దుఃఖ కరమే - (2) 

అభ్యసించిన నీతి - సమాధాన ఫలమే - (2) 


అంతా నా మేలుకే - ఆరాధనా యేసుకే Watch Video

Post a Comment

0 Comments