Ticker

6/recent/ticker-posts

ఎడబాయని నీ కృప song Lyrics

ఎడబాయని నీ కృప Lyrics - Hema chandra


ఎడబాయని నీ కృప
Singer Hema chandra
Composer Pastor Mathews
Music Jk Christopher
Song WriterPastor Mathews

Lyrics

ఎడబాయని నీ కృప – నను విడువదు ఎన్నటికీ (2)

యేసయ్యా నీ ప్రేమానురాగం – నను కాయును అనుక్షణం  (2)   ||ఎడబాయని||


1.శోకపు లోయలలో కష్టాల కడగండ్లలో – కడలేని కడలిలో నిరాశ నిసృహలో (2)

అర్ధమేకాని ఈ జీవితం – ఇక వ్యర్థమని నేననుకొనగ  (2)

కృపా కనికరముగల దేవా – నా కష్టాల కడలిని దాటించితివి   (2)   ||ఎడబాయని||


2.విశ్వాస పోరాటంలో ఎదురాయె శోధనలు – లోకాశల అలజడిలో – సడలితి విశ్వాసములో  (2)

దుష్టుల క్షేమమునే చూచి – ఇక నీతి వ్యర్థమని అనుకొనగ (2)

దీర్ఘశాంతముగల దేవా – నా చేయి విడువక నడిపించితివి   (2)  ||ఎడబాయని||


3.నీ సేవలో ఎదురైన ఎన్నో సమస్యలలో – నా బలమును చూచుకొని నిరాశ చెందితిని  (2)

భారమైన ఈ సేవను – ఇక చేయలేనని అనుకొనగ  (2)

ప్రధాన యాజకుడా యేసు – నీ అనుభవాలతో బలపరిచితివి   (2)   ||ఎడబాయని||


ఎడబాయని నీ కృప Watch Video

Post a Comment

0 Comments