Ticker

6/recent/ticker-posts

నీ బాహుబలము ఎన్నడైన

Lyrics


నీ బాహుబలము ఎన్నడైన దూరమాయెనా

నిత్య జీవమిచ్చు నీదు వాక్కు ఎపుడైనా మూగబోయెనా } 2

నిర్మల హృదయుడా నా దీపము వెలిగించితివి

యేసయ్య అపారమైనది నాపై నీకున్న అత్యున్నత ప్రేమ } 2|| నీ బాహుబలము ||

ఇంత గొప్ప రక్షణ కోటలో నను నిలిపితివి

దహించు అగ్నిగా నిలిచి విరోధి బాణములను తప్పించితివి }2

అవమానించినవారే అభిమానమును పంచగా

ఆనంద సంకేతమే ఈ రక్షణ గీతం } 2|| నీ బాహుబలము ||

సారవంతమైన తోటలో నను నాటితివి

సర్వాదికారిగా తోడై రోగ మరణ భీతినే తొలగించితివి } 2

చీకటి కమ్మిన మబ్బులే కురిసెను దీవెన వర్షమై

ఇంత గొప్ప కృపను గూర్చి ఏమని వివరింతును } 2|| నీ బాహుబలము ||

వీశ్వాస వీరుల జాడలో నను నడిపించుచూ

పుటము వేసి యున్నావు సంపూర్ణ పరిశుద్ధత నేనొందుటకు } 2

శ్రమనొందిన యేండ్ల కొలది సమృద్ధిని నాకిచ్చెదవు

గొప్ప సాక్షి సంఘమై సిలువను ప్రకటింతును }2|| నీ బాహుబలము ||


నీ బాహుబలము Watch Video

Post a Comment

0 Comments