Ticker

6/recent/ticker-posts

ఇళ్లలోన పండుగంట

ఇళ్లలోన పండుగంట

Lyrics

ఇళ్లలోన పండుగంట

కళ్ళలోన కాంతులంట

ఎందుకో ఎందుకే కోయిలా

చెప్పవే చెప్పవే కోయిలా

మల్లెపూల మంచు జల్లు

మందిరాన కురిసె నేడు

ఎందుకో ఎందుకే కోయిలా

చెప్పవే చెప్పవే కోయిలా

1.అర్ధరాత్రి కాలమందు వెన్నెల... ఆహా

ఆశ్చర్యకరుడంట వెన్నెల... ఆహా (2)

జన్మించినాడంట వెన్నెలా

ఈ అవనిలోనంట వెన్నెలా (2)

                               ||ఇళ్లలోన||

2.ఏ ఊరు ఏ వాడ ఏ దిక్కు

పుట్టినాడు కోయిలా

చెప్పవే చెప్పవే కోయిలా (2)

ఆ... యూదా దేశమందు వెన్నెల... ఆహా

బెత్లెహేము పురమునందు వెన్నెలా ఆహా (2)

రాజులకు రాజంట వెన్నెలా

ఆ రాజు యేసంట వెన్నెల (2)

                                ||ఇళ్లలోన||

3.ఆ హ.. తార చూపు దారిలోనే

వచ్చినారు ఎవ్వరే కోయిలా

చెప్పవే చెప్పవే కోయిలా (2)

తూర్పు దేశ జ్ఞానులమ్మ వెన్నెల... ఆహా

దర్శింప వచ్చినారు వెన్నెల... ఆహా (2)

బంగారు సాంబ్రాణి బోళం

తెచ్చినారు ఇచ్చినారు వెన్నెలా (2)

                                ||ఇళ్లలోన||


ఇళ్లలోన పండుగంట Watch Video

Post a Comment

0 Comments