Ticker

6/recent/ticker-posts

కన్నీరేలమ్మా - శామ్యూల్ కర్మోజి

కన్నీరేలమ్మా Lyrics - శామ్యూల్ కర్మోజి


Singer శామ్యూల్ కర్మోజి
Composer శామ్యూల్ కర్మోజి
Music
Song Writer శామ్యూల్ కర్మోజి


కన్నీరేలమ్మా… కరుణించు యేసు నిన్ను విడువబోడమ్మా

కలవరపడకమ్మా… కరుణించు యేసు నిన్ను విడువబోడమ్మా

కరుణ చూపి కలత మాన్పె (2)

యేసే తోడమ్మా ||కన్నీరేలమ్మా||

నీకేమీ లేదని ఏమీ తేలేదని

అన్నారా నిన్ను అవమాన పరిచారా

తల రాత ఇంతేనని తర్వాత ఏమౌనోనని

రేపటిని గూర్చి చింతించుచున్నావా

చింతించకన్న యేసు మాటలు మరిచావా

మారాను మధురంగా మార్చెను చూసావా (2)||కన్నీరేలమ్మా||

నీకెవరూ లేరని ఏం చేయలేవని

అన్నారా నిన్ను నిరాశపరచారా

పొరుగంటివాడనని ఎప్పటికీ ఇంతేనని

నా బ్రతుకు మారదని అనుకుంటూ ఉన్నావా

నేనున్నానన్న యేసు మాటలు మరిచావా

కన్నీరు నాట్యంగా మార్చును చూస్తావా (2)   ||కన్నీరేలమ్మా||

కన్నీరేలమ్మా Watch Video

Post a Comment

0 Comments