Ticker

6/recent/ticker-posts

సజీవుడైన యేసయ్య Song lyrics

సజీవుడైన యేసయ్య Song lyrics 

సజీవుడవైన యేసయ్య 

నిన్నాశ్రయించిన నీ వారికి

సహాయుడవై తృప్తి పరచితివే

సముద్రమంత సమృద్ధితో (2)

ఆనందించెద నీలో – అనుదినము కృప పొంది

ఆరాధించెద నిన్నే – ఆనంద ధ్వనులతో (2) 

1.ధన రాసులే ఇలా – ధనవంతులకు – ఈ లోక భాగ్యము

దాచిన మేలులెన్నో – దయచేసినావే – ఇహ పరమున నాకు (2)

శ్రమల మార్గమును నిరీక్షణ ద్వారముగా చేసితివి

శ్రేష్టమైన నీ వాగ్ధానములతో (2) (సజీవుడవైన)

2.క్షేమము నొందుటయే – సర్వ జనులకు – ప్రయాసగా మారే

క్షేమాధారము నీవై – దీర్ఘాయువుతో – సంతృప్తి పరతువు నన్ను (2)

నిత్య నిబంధనగా నీ వాత్సల్యమును చూపితివే

నిత్యమైన నీ సత్య వాక్యముతో (2) (సజీవుడవైన)

3.నలువది ఏండ్లు – నీ స్వాస్థ్యమును – మోసినది నీవే

నీ కృప కాంతిలో – నా చేయి విడువక – నడిపించుచున్నది నీవే (2)

పరమ రాజ్యములో మహిమతో నింపుటకు అనుగ్రహించితివే

పరిపూర్ణమైన నీ ఉపదేశమును (2) (సజీవుడవైన)


సజీవుడవైన యేసయ్యా Watch Video

Post a Comment

0 Comments