Ticker

6/recent/ticker-posts

మందిరములోనికి రారండి song lyrics

మందిరములోనికి రారండి Lyrics - Song

మందిరములోనికి రారండి

వందనీయుడేసుని చేరండి (2)

కలవరమైనా కలతలు ఉన్నా (2)

తొలగిపోవును ఆలయాన చేరను

కలుగు సుఖములు ఆ ప్రభుని వేడను          ||మందిరము||

దేవుని తేజస్సు నిలిచే స్థలమిది

క్షేమము కలిగించు ఆశ్రయ పురమిది (2)

వెంటాడే భయములైనా

వీడని అపజయములైనా (2)       ||తొలగిపోవును||

సత్యము భోదించు దేవుని బడి ఇది

ప్రేమను చాటించు మమతల గుడి ఇది (2)

శ్రమల వలన చింతలైనా

శత్రువుతో చిక్కులైనా (2)       ||తొలగిపోవును||

శాంతి ప్రసాదించు దీవెన గృహమిది

స్వస్థత కలిగించు అమృత జలనిధి (2)

కుదుటపడని రోగమైనా

ఎదను తొలిచే వేదనైనా (2)       ||తొలగిపోవును||

మందిరములోనికి రారండి Watch Video

Post a Comment

0 Comments